
– అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఎఐయుకేఎస్) డిమాండ్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, నూతన వ్యవసాయ విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ ఐ యు కె ఎస్) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రైతు డిమాండ్ డే సందర్భంగా గురువారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం లో ఏఓ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టి అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం డివిజన్ నాయకులు పొన్నాల లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఉన్న ప్రజలు కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు ప్రజా సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతుల పరిస్థితి దీనంగా మారింది అన్నారు.రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని వారన్నారు. మద్దతు ఇవ్వాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వడంలో మోసం చేస్తున్నాయని అన్నారు. చట్టసభల్లో ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.వ్యవసాయ రంగంలో సంక్షోభం వలన చాలామంది ఉపాధి కోల్పోయి యువకులు పల్లెలు వదిలి పట్టణాలకు బతుకుదెరువుకై వలస వెళ్తున్నారు. 4 లక్షల మంది వ్యవసాయం చేసే రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు అని వారన్నారు. ఎన్ఆర్ఈజిఎస్ స్కీంలో కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 600 రూపాయలతో పాటు 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు ,ఇంకా 16 లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయకుండా పూర్తిస్థాయిలో అమలు అయినట్లుగా ప్రకటించటం సిగ్గుచేటు అని వారన్నారు. కుటుంబానికి రెండు లక్షల దాటిన పంట రుణం ఉంటే కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని లక్ష వరకు దాటిన పంట రుణాల ఉంటె అమలు చేసినట్లుగా ప్రకటించటడము సరైంది కాదు. కుటుంబానికి రెండు లక్షలకు దాటి కూడా నాడు అందరికీ రుణమాఫీ చేశామని ఇప్పటికీ రెండు లక్షల ఇవ్వలేదన్నారు.దరఖాస్తుల పేరా రైతులను అయోమయానికి గురి చేయకుండా రైతు భరోసాను కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా తక్షణమే అమలుకు పూలుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామ సత్తిరెడ్డి, గోగుల వీరబాబు,శంకర్, జాన్ సుందర్,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.