మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి

– బి. సంజీవ డివైఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు 
నవతెలంగాణ-గోవిందరావుపేట
మణిపూర్లో రెండు తెగల మధ్య జరుగుతున్న వైరుధ్యాలలో మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసి మానభంగంకి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు బి సంజీవ అన్నారు. శనివారం మండలంలోని పసర లో 163 వ జాతీయ రహదారిపై డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మణిపూర్ నిధితులను కఠినంగా శిక్షించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారో కొని ఉద్దేశించి సంజీవ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య జరుగుతున్న మత కుల గర్షణలలో మారణకాండ సృష్టిస్తుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మౌనం వహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పుతున్న మోడీ అల్లర్లను అదుపు చేయడంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు మానభంగానికి మారణకాండకు కారకులైన నిందితులను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల ఈ ప్రభుత్వానికి గద్దె దింపేంతవరకు ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన ఈ ప్రభుత్వాలు హెచ్చరించాడు ఈ కార్యక్రమంలో పిట్టల అరుణ్ కనుమల్ల సందీప్ మాదాసు శ్రావణ్ పల్లపు రాజు కందుల శ్రావణ్ కడారి అశోక్ జీవన్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.