ఇఫ్లూ ఘటనపై దోషులను శిక్షించాలి

– మానవ హక్కుల కమిషన్‌కు ఐద్వా వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇప్లూలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులను శిక్షించాలని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మితో పాటు సంఘం ఉపాధ్యక్షులు కేఎన్‌ ఆశాలత, నాయకురాలు వి కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం మానవ హక్కుల కమిషన్‌లో ధరఖాస్తు చేశారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులను నెల రోజులైనా గుర్తించకపోవటం విచారకరమని తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెడు తున్నారని తెలిపారు యూనివర్సిటీ లో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ వైస్‌ఛాన్సలర్‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైస్‌ఛాన్సలర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీని చట్టం నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని కోరారు.