
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగుడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం సోమవారం చేశారు. పదనో ఉపాధ్యాయుడు రాములు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పదనో ఉపాధ్యాయులు ప్రభాకర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల్రాజ్, అశోక్ ,దీపిక ,రవీందర్ ,రవి, శకుంతల, ఇంద్ర ,అనిత, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.