– గడపగడపకు ప్రచార కార్యక్రమంలో పొంగులేటి
నవతెలంగాణ-ఖమ్మం
అందరి చూపు… కాంగ్రెస్ వైపే ఉందని…. రాష్ట్రం యావత్తు హస్తం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యనించారు. బుధవారం ఖమ్మం నియోజకవర్గ స్థాయి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్ నుంచి ప్రారంభించారు. తొలుత స్థానికంగా ఉన్న రామాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.500కే వంట గ్యాస్, రూ. 5లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం, రెండు లక్షల రైతు రుణమాఫీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఖచ్చితంగా కాంగ్రెస్‌దే అధికారమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, జిల్లా నాయకులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్, కార్పొరేటర్ లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, మలీదు జగన్, ముస్తాఫా, కొప్పెర ఉపేందర్, ఓబీసీ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, షేక్ ఇమామ్, దుంపల రవికుమార్, బోడా శ్రావణ్ కుమార్, గుడిపూడి రజనీకాంత్, కాంపాటి వెంకన్న, కీసర పద్మజా రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, శ్రీ కళా రెడ్డి, బాణోత్ జ్యోత్స్న, ఆరీఫ్, కె. చంద్రశేఖర్, చల్లా రామకష్ణ రెడ్డి, రాధాకష్ణ, మొగిలిచర్ల సైదులు, ఉపేందర్, హెచ్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.