రేపటితో ముగియనున్న రూ.2వేల నోటు మార్పిడి గడువు

న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడికి మరికొన్ని గంటల్లో గడువు ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు మార్చుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకునేది ఆర్బీఐ వెల్లడించలేదు. రూ.2వేల నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మేలో ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.