గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదుకు చివరి గడువు  ఫిబ్రవరి 6

– తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట :
గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సి ఓటరు గా నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 6 చివరి గడువు అని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. సాదారణ ఓటరు జాబితాలో ఓటరు గా నమోదు అయి ఉండి,2020 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి,స్థానికులు అయిన ప్రతీ ఒక్కరు గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సి ఓటరు గా నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.