నవతెలంగాణ – హైదరాబాద్: వాషింగ్టన్‌లో రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత -1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషులు 30-90 నిమిషాలు మించి జీవించలేరని నిపుణులు చెబుతున్నారు.