
మండల కేంద్రంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లు తమ ప్రాణాలను చివరి రక్తం బొట్టు వరకు దేశం కోసం త్యాగం చేయడం జరిగిందని అన్నారు. గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు వెల కట్టలేనివీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.