నవతెలంగాణ కంఠేశ్వర్
నగరంలోని నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిందని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి శుక్రవారం ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ముస్కాన్ కలెక్షన్స్ ముందు శంభునిగుడి దగ్గర ఒక గుర్తు వృద్ధురాలు వయస్సు అందజ వయసు 55 నుంచి 60 సంవత్సరాలు, పసుపు కలర్ స్వెటర్ ఎరుపు రంగు చీర ధరించింది. అపస్మారక స్థితిలో ఉన్నందున 108 అంబులెన్స్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స గురించి తరలించామన్నారు. వృద్ధురాలు చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6వ తేదీన 11:30 నిమిషాలకు మృతి చెందింది. ఈమె వాలకం బట్టి బిక్షాటన చేసుకునే వృద్ధురాలుగా కనపడుతున్నది. ఈమెకు సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ లో సంప్రదించగలరు అని ఫోన్ నెంబర్ 8712659714 సమాచారం అందించాలన్నారు.