మాజీ జెడ్పిటిసి మృతి పార్టీకి తీరని లోటు

నవతెలంగా-భిక్కనూర్
మాజీ జెడ్పిటిసి సభ్యులు సత్య లింగం మృతి చెందడం పార్టీకి ఎంతో తీరని లోటని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం మండల కేంద్రానికి వచ్చి ఆయన మృతదేహం పై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. మృతుడు సత్యలింగం జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులుగా, పట్టణ సొసైటీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. నివాళులు అర్పించిన వారిలో పట్టణ సర్పంచ్ వేణు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ లింగాల కిష్టా గౌడ్, ఎంపీపీ గాల్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, సొసైటీ అధ్యక్షులు భూమయ్య, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు నరసింహులు, సిద్ధిరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, నాయకులు మల్లేశం, ప్రభాకర్, నరసింహులు, రాజిరెడ్డి, భూమి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.