
సీనియర్ నాయకులు కీసర స్వామీ మృతి పార్టీకి తీరని లోటు అని సీపీఐ పార్టీ నాయకులు ఎలగందుల అంజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని దుప్పెల్లి కి చెందిన కీసర స్వామీ ఇటీవల అనారోగ్యానికి గురై గురువారం మృతిచెందడంతో శుక్రవారం ఆయన మృతదేహం పై పార్టీ కండువా కప్పి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతుడు చిన్న నాటి నుండి పార్టీలో క్రియా శీలకంగా పనిచేశాడని, ఎర్ర జెండాను తుదివరకు వదలకుండా నిస్వార్ధంగా పనిచేశారని, ఆయన మృతితో పార్టీకి లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలేపాక యాదయ్య, సలిగంజి వీరస్వామి, ఎల్లంకి మహేష్,నరిగే యాదయ్య,కట్ల యాదగిరి,యాస జనార్దన్ రెడ్డి,సుద్దాల సాయికుమార్, కవటి సుధాకర్,సలిగంజి కృష్ణ కుమార్,పలుసం సోమల్లు,నోముల నర్శయ్య,కన్నబోయిన పృథ్వీరాజ్, ఎర్ర కిరణ్,మామిడికాయల నరేష్ తదితరులు పాల్గొన్నారు.