రాయల చంద్రశేఖర్‌ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు

Navatelangana,Telangana,Telugu News, Telangana News,Khammam– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ రాష్ట్ర నేత రాయల చంద్రశేఖర్‌ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన సిపిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ రాష్ట్ర నేత రాయల చంద్రశేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. కాగా సోమవారం ఆ కుటుంబాన్ని తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, పప్పుల ఉపేందర్‌, ఎల్లంపల్లి నాగయ్య, రాయల రవికుమార్‌, తమ్మినేని ఉమా, దొండేటి సుగుణమ్మ, తమ్మినేని ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.