నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విప్లవ స్వాప్నికుడు, నిరంతర ఉద్యమ శీలి, డీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు శీలం లక్ష్మారెడ్డి మరణం ఉపాధ్యాయ ఉద్యమాలకు తీరనిలోటని డీటీఎఫ్ అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.