యువకుల మృతి నా హృదయాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది..

The death of the youth has shocked my heart.– హన్మాజీపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో గత ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విక్కుర్తి దిలీప్, సుర అనిల్ కుటుంబ సభ్యులను వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. బంగారు భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా మృతి చెందడం నా హృదయాన్ని ద్రిగ్భాంతి కి గురిచేసిందని ఆది శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో రెండు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చి మృతి చెందిన కుమారుల లోటును తల్లిదండ్రులకు ఎవరు పూడ్చలేరని, ఇంతటి దుఃఖ సమయంలో ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆయన ప్రార్థించారు. ఆయన వెంట రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి, లింగంపల్లి మాజీ సర్పంచ్ సామ కవితా- తిరుపతిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలక ప్రభాకర్, తీగల ఎల్లయ్య తోపాటు తదితరులు  పాల్గొన్నారు.