ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావు: సింగబోయిన మల్లేశం

The decisions taken by the inter board were not correct: Singaboina Malleshamనవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు సరైన కావని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల అధికార ప్రతినిధి సింగబోయిన మల్లేశం అన్నారు.  గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటర్ బోర్డు 15 రోజుల పరీక్షల ముందు ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ముందస్తుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే స్వాగతిస్తామని అన్నారు. ఇలా ముందస్తు కెమెరాల ఏర్పాటుతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనై అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ స్పందించి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రాక్టికల్, థీయిరీ సెంటర్లకు అనుమతి ఇవ్వమని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తిరిగి ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి బత్తుల శంకర్, జాయింట్ సెక్రటరీ మదిర మల్లెశం, దరిపల్లి ప్రవీణ్,జంగయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్, మల్లేశం, పరశురాములు  పాల్గొన్నారు.