అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలి

– నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్‌
నవతెలంగాణ-దుబ్బాక రూరల్‌

దుబ్బాక మండల కేంద్రంలోని ఐసిడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడి ఉద్యోగులు చేపట్టిన సమ్మె 9 వరోజు కు చేరుకుంది. ఈ సమ్మెకు మంగళవారం తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌, తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్‌ ప్రభుత్వం తీర్చలన్నారు.అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం రూ.26000/- ఖచ్చితంగా చెల్లించి, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలి కోరారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులందరికీ గ్యారెండిటీ చెల్లించాలినీ,రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ (ప్రయోజనాలు) టీచర్లకు 10 లక్షలు,హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలినీ, జీవితంలో సగం పెన్షన్‌ ఇచ్చేందుకు నిర్ణయించాలినీ కోరారు.60 సంవత్సరాలు తర్వాత అంగన్వాడీ వర్కర్లు వాలంటరీ రిటైర్మెంట్‌ అడిగితే వాళ్లకి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తప్పనిసరిగా కల్పించాలినీ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. అధిష్టానంతో అంగన్వాడీల వర్కర్లు సమస్యలపై చర్చించి వారికి ఉపయోగపడేలాగా మేనిఫెస్టో ఉండేలా నా వంతు కషి చేస్తానని అంగన్వాడి వర్కర్లకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ‘టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ’ కర్నల్‌ శ్రీనివాసరావు, మంచాల మల్లేశం, ఎల్లం, ఐరేని సాయితేజ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.