జీపీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

– మోకాళ్ళపై కూర్చొని జీపీ కార్మికులు నిరసన
– మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ
నవతెలంగాణ-దోమ
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చేస్తున్న సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజుకు చేరుకుందన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట జీపీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను గ్రామాలను శుభ్రం చేసి అద్దంలో తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాలను కాపా డుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిం చకుండా వివక్ష ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పంచాయతీ సిబ్బంది ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్‌ 51ని వెంటనే ఉపసంహరించుకోవాలని వా రు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా, కారోబార్‌, బీల్‌కలె క్టర్‌లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. గ్రామ పంచాయతీలలోని ప్రతి ఉద్యోగి, కార్మికుడికి కనీస వేతనం రూ.19,500 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశా రు. జీపీ సిబ్బంది నాయకులతో చర్చలు జరిపి వారి న్యా యమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేకపోతే సీ ఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమా లు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్య క్రమంలో రమేష్‌, వెంకటయ్య, అనంతయ్య, యాదయ్య, శ్రీనివాస్‌, రాములు, లక్ష్మి, వెంకటమ్మ, సత్యమ్మ, లక్ష్మి, నర్స మ్మ, రాజ్యమ్మ, పద్మమ్మ, శ్యామలమ్మ, నర్సమ్మ, మైసమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.