బీటీ రోడ్డు మర్మతులు తక్షణమే చెపట్టాలి: దయ్యాల నర్సింహ్మ

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని హన్మాపురం నుండి అనంతరం, తాజ్ పూర్ గ్రామాల వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీసీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీసీఐ(ఎం) హన్మాపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా నర్సింహ హాజరై,  మాట్లాడారు.  హన్మాపూర్ మీదుగా అనంతరం నుండి బీబీనగర్, తాజ్ పూర్ నుండి బొమ్మలరామారం వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని  ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి  తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ మధ్యకాలంలో గెలిచిన స్థానిక శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ తక్షణము స్పందించి రోడ్డును పరిశీలన చేసి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మరోమారు బీటీ రోడ్డును వేయాలని నర్సింహ డిమాండ్ చేసినారు. 15 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే మూడు గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీసీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, సహాయ కార్యదర్శి బండి శ్రీను, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దయ్యాల మల్లేష్, సీసీఐ(ఎం) నాయకులు గ్రామ ప్రజలు తోటకూరి నాగరాజు, తోటకూరి గణేష్, కుసుమ మధు, పైళ్ల సత్తిరెడ్డి, ముద్దం చంద్రయ్య, కమ్మ బాలయ్య, శీను, అరిగే సంజీవ, సోమ అంజయ్య  పాల్గొన్నారు.