పంటల వివరాలు ఆన్ లైన్ లో నమోదు

నవతెలంగాణ- రాజంపేట్ ( భిక్కనూర్ )
రాజంపేట్ పట్టణ కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏ ఈ ఓ శిల్ప మాట్లాడుతూ గ్రామంలో రైతులు పండిస్తున్న యాసంగి పంటలు వివరాలు డిసిఎస్ యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని రైతులు అందుబాటులో ఉండి పంటల వివరాలు నమోదు చేయడానికి వ్యవసాయ అధికారులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు ఉన్నారు.