ప్రశస్త యాప్ లో దివ్యాంగుల వివరాలు నమోదు చేయాలి 

The details of the disabled should be entered in Prasasta app– పాఠశాల స్థాయిలో వైకల్యాలను గుర్తించాలి డిఆర్పి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
ప్రశస్త యాప్ లో దివ్యాంగుల వివరాలు నమోదు చేయాలని డిస్టిక్ రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గురువారం అన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రశస్త యాప్ గురించి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మండలంలోని అన్ని గ్రామాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో ప్రశస్త యాప్ లో దివ్యాంగ విద్యార్థుల నమోదు గురించి అవగాహన కార్యక్రమాన్ని ఎంఈఓ శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రశస్త యాపు ముఖ్య ఉద్దేశం గురించి డి ఆర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఉన్న అందరూ విద్యార్థులను స్కీనింగ్ చేసి అందులో ప్రధానంగా దివ్యాంగ విద్యార్థులను గుర్తించి వారి యొక్క వివరాలను వైకల్యాలకు అనుగుణంగా వారి యొక్క వివరాలను యాప్ లో పొందపరచాలని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ పర్యవేక్షణ చేస్తూ ప్రశస్తా యాపు గురించి రిసోర్స్ పర్సన్లు వివరించిన విధంగా అందరూ ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి మిస్ కాకుండా నమోదు చేయాలని దివ్యాంగ విద్యార్థులను కూడా నమోదు చేయాలని సూచనలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్పి శ్రీనివాస్ రెడ్డి మరియు రిసోర్స్ టీచర్స్ స్వామి, పద్మజ మరియు సిఆర్పిలు ,ఎంఆర్సి సిబ్బంది, ఎం టి ఎస్, కంప్యూటర్ ఆపరేటర్ రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.