విత్తనాలను కొనే రైతు వివరాలను నమోదు చేయాలి..

– జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్…
నవతెలంగాణ – డిచ్ పల్లి 
విత్తనాలను కొనుగోలు చేసే ప్రతి  రైతు వివరాలను నమోదు చేయాలని, ఈ పాస్ మెషీన్ ద్వారానే ఎరువుల కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు.బుదవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని పలు ఎరువుల, పురుగు మందుల దుకాణాలను మండల ఇంచార్జీ వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు తో కలిసి అకస్మీకంగా తనిఖీ చేశారు.  ఆయా దుకణల్లో ఉన్న ఎరువుల నిల్వలను తనిఖీ చేసి ఆన్లైన్లో ఉన్న ఎరువుల నిల్వలు, గోదాములలో ఉన్న ఎరువుల నిల్వలు సమానంగా ఉన్నవా లేవా అనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పాస్ మెషీన్ ద్వారానే ఎరువుల కొనుగోలు చేయాలని సూచించారు. మండలంలోని యెల్ల రెడ్డి పల్లి, నల్లవెల్లి సహకార సొసైటీ లలో కూడా ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. అదేవిధంగా విత్తనాల నిల్వలను కొనుగులు వివరాలను తెలుసుకున్నారు. విత్తనాలను అమ్మే ప్రతి దుకాణం విత్తనాలను కొనే ప్రతి రైతు వివరాలను నమోదు చేయాలని సూచించారు.ఎవరైన నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతు కూడా విత్తనాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొవలని, ఏలాంటి మోసపురిత మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో, ఆన్లైన్లో నమోదు చేస్తూ ఉండాలని సూచించారు.అయన వేంట ఏఈవోలు శ్రీహరి, ప్రకాష్, సతీష్ సహకార సొసైటీ సిఈఓ తేజ గౌడ్, తోపాటు తదితరులు ఉన్నారు.