– డీసీసీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి, బ్లాక్ బి.అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్ ,కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అంజనేయులు ముదిరాజ్
– 6 గ్యారెంటీ పథకాలపై ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-కుల్కచర్ల
బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసని భీంరెడ్డి, బ్లాక్ బి.అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్, కాంగ్రెస్ మండ లాధ్యక్షుడు అంజనేయులు ముదిరాజ్ అన్నారు. శనివారం మండలం రాంపూర్‌లో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలుచేసే 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ…బడుగు, బల హీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిం దంటే అమలుచేసి తీరుతుందన్నారు. పరిగి నియో జకవర్గంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామ్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, కుల్క చర్ల ఎంపీటీసీ ఆనందం ముదిరాజ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కుమ్మరి స్వామి, కనకం మొగులయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.