మంత్రి అందించిన అభివృద్ధిని ఇంటింటికి వివరించాలి

నియోజకవర్గ  సమన్వయ కమిటీ సభ్యుడు లుక్క గంగాధర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించిన విస్తృత అభివృద్ధి పనులను ఇంటింటికి వెళ్లి గుర్తు చేయాలని బిఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు లుక్క గంగాధర్ అన్నారు. సోమవారం మండలంలోని చౌట్ పల్లిలో నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ కార్యకర్తలు సగర్వంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారన్నారు. ఈ అభివృద్ధిని కార్యకర్తలు గ్రామంలో ప్రజలకు గుర్తు చేస్తూ వివరించాలన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు చెప్పే కల్లిబొల్లి కథలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.మంత్రి అందించిన అభివృద్ధిని నిరంతరం ప్రజల్లో వివరిస్తూ పోతే ప్రతిపక్ష నాయకులకు ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు.ఈ సమావేశంలో సర్పంచ్ మారు శంకర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు నవీన్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ కుంట ప్రతాప్, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు కొమ్ముల రాజేందర్ రెడ్డి, డైరెక్టర్ బట్టు అశోక్, రైతు విభాగం మండల అధ్యక్షుడు బద్దం రాజశేఖర్, సుంకరి మురళి ముదిరాజ్, మాజీ సర్పంచ్ అల్ల కొండ రాజన్న, మాజీ ఎంపీటీసీ అల్లకొండ సాయన్న, డాకా దుర్గాప్రసాద్, నాగుల రంజిత్,  మహేష్, సందీప్, అబీద్ అలీ, వాజిద్ అలీ, గడ్డం రాజేశ్వర్, బిట్ లింగ్ శ్రీను, తోట శ్రీధర్, కొమ్ముల శ్రీను, ఎలాల శంకర్, జుంబరత్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.