
నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో జరిగిందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే తెలిపారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు జుక్కల్ నియోజకవర్గం స్థాయి మంచినీళ్ల పండుగ కార్యక్రమం మద్నూర్ మండలంలోని శాఖాపూర్ గ్రామంలో నిర్వహించారు జుక్కుల్ ఎమ్మెల్యే అనుమంతుసిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు మిషన్ భగీరథ మంచినీటి పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనకు శాఖాపూర్ గ్రామ సర్పంచ్ ఎంకే పటేల్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది బహిరంగ సభ స్థలంలో ఎమ్మెల్యేకు మహిళలంతా హారతిలతో స్వాగతించారు అనంతరం మంచినీటి పండుగ బహిరంగ సభలో మిషన్ భగీరథ అధికారులు అలాగే గ్రామ సర్పంచ్ మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల కాలంలో అభివృద్ధిని సాధించి తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజల కోసం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారని తెలిపారు ఈ సంక్షేమ పథకాలు భాగంగా ఇంటింటికి మంచినీటి పథకాన్ని అమలుపరిచి ప్రజలకు ఆరోగ్యవంతమైన నీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హనుమంతు షిండే కు గ్రామ సర్పంచ్ ఎంకే పటేల్ ఆయన తండ్రి కలిసి శాలువా గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య ప్రజా ప్రతినిధులకు అందరికీ శాలువలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీబాయి, డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, బి ఆర్ ఎస్ మద్నూర్ మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, డోంగ్లి మండల పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్, శాఖాపూర్ గ్రామ సర్పంచ్ ఎంకే పటేల్, ఉపసర్పంచ్ గౌతమ్, ఎంపీటీసీ సభ్యులు, మండల అభివృద్ధి అధికారి రవిశ్వర్ గౌడ్, మిషన్ భగీరథ పథకం డి ఈ లు కౌశిక్, అరవింద్, ఏ ఈ గణేష్ ,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, శాఖాపూర్ గ్రామ పాఠశాల హెచ్ఎం నాగనాథ్, ఆ గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

