– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్
నవతెలంగాణ-తుంగతుర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం అభివద్ధి సాధించిందని, సబండవర్గాలు సంతోషంగా ఉన్నాయని ్త బీఆర్‌ఎస్ తుంగతురిఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదర్ కిశోర్‌కుమార్ అన్నారు.మంగళవారం మండలపరిధిలోని అన్నారం,సంగెం,గుడితండా గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగించారు.దేశంలో ఎక్కడా అమలుకానీ సంక్షేమపథకాలు మనరాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని తెలిపారు.కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని.60 ఏండ్లుగా నమ్మి మోసపోయారన్నారు.2014 ముందు నియోజకవర్గంలో ఆసరా పెన్షన్ లబ్దిదారులు 10,000 మాత్రమేనని నేడు 50,000 మంది లబ్దిదారులు ఉన్నారని తెలిపారు.కేసీఆర్ పాలనలో పార్టీలకతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివద్ధి చెందాలంటే మరో మారు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాల్సిందేనని ,తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగరాల్సిందేననానరు.అన్నారం గ్రామ ప్రజల స్వాగతోత్సవ ర్యాలీని చూస్తుంటే, విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నంత సంతోషంగా ఉందన్నారు.ఇంత పెద్దఎత్తున స్వాగతం పలికిన ప్రజానీకానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ దీపిక యుగంధర్‌రావు, రాష్ట్ర నాయకులు యుగంధర్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్, ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, దొంగరి శ్రీనివాస్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, అన్నారం గ్రామ అధ్యక్షులు అండెం వెంకట్‌రెడ్డి,ఏటేర్గు శ్రీనివాస్‌రెడ్డి, రేగటి శ్రీనివాస్,పోగుల రామకష్ణారెడ్డి, కుంచాల వీరారెడ్డి,ఎంపీటీసీ వంటల కష్ణ,మట్టపల్లి వెంకట్,బెడద రాములు,సోమశేఖర్,పోతరాజు,పోగుల శ్రీకాంత్ రెడ్డి, జటంగి సత్యనారాయణ,సైదులు పాల్గొన్నారు.