
భారత రాజ్యాంగం సామాన్యునికి ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కుఅని తహసీల్దార్ సరోజ పావని అన్నారు. శనివారం జాతీయ ఓటర్లు దినోత్సవం సందర్బంగా మండల కేంద్రం లో విద్యార్థులతో కలిసి నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి ఓటు హక్కుపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ఎవరు అమ్ముకోవద్దని, మీకు నచ్చినవారికి ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధి, దేశం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఓటు గురించి అవగాహన కల్పించి, అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించామని తెలిపారు.