
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల అనిత తండ్రి సుబ్బురు సత్తయ్య అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతిచెందగా, ఆదివారం చందుపట్ల గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై, బీర్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ అంత్యక్రియలకు హాజరైన వారిలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్, మహిళా అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, భువనగిరి, యాదగిరిగుట్ట జడ్పిటిసిలు సుబ్బురు బీరు మల్లయ్య తోటకూర అనురాధ , భువనగిరి, ఆలేరు నియోజకవర్గం లోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు అధ్యక్షులు హాజరయ్యారు.