నవతెలంగాణ చివ్వేంల : సోమవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశ అనంతరం పెద్ద ఎత్తున దావత్ ఏర్పాటు చేశారని, ఈ విందులో మటన్, చికెన్, చేపలు, కొర్రమిను లాంటి ప్రత్యేక వంటలతో పాటు మద్యం బాటిల్స్ కూడా తెచ్చి పెట్టినట్లు, ఈ దావత్ కు కావలసిన ఖర్చు మొత్తం ప్రజాప్రతినిధులు భరించాల్సిందేనని అధికారులు హుకుం జారీ చేశారని ,ఒకొక్కరి నుంచి రూ 50000 వేలనుంచి పదివేల రూపాయలు ఇవ్వాలని మండల బాస్ ప్రజా ప్రతినిధులను ఆదేశించినట్లు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది .. ఒకవేళ ఏ ప్రజాప్రతినిధి ఖర్చు భరించకపోయిన మీకు రావలసిన పెండింగ్ బిల్లుల చెల్లింపులో ఏలాంటి సహకారం అందించే ప్రసక్తేలేదని స్పష్టంగా చెప్పినట్లు సర్వసభ్య సమావేశం అనంతరం సుక్కముక్క అనంతరం డీజే సౌండ్స్ తో దద్దరిల్లేలా ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడం మండలంలో ఒక చర్చకు దారితీసింది
ఎంపీడీఓ లక్ష్మి వివరణ సర్వసభ్య సమావేశం అనంతరం సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.