
నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలు అదృష్టమైనట్లు నిజామాబాద్ నగర సిఐ నరహరి గురువారం తెలిపారు. నగర సిఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో 85 సంవత్సరాల కోనేరు లక్ష్మి మే 30వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుండి కనబడడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు. వృద్ధురాలికి కళ్ళు సరిగా కనబడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వృద్ధురాలు ఎక్కడైనా కనబడితే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేదా నగర సీఐ 8712659836 నెంబర్ క సమాచారం అందించాలన్నారు.