
యువతి అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ఘన్పూర్ తాండాకు చెందిన భూక్య శిరీష, గురువారం ఉదయం 5 గంటలకు రామారెడ్డి లో ఎన్నికల వాలంటారుగా పనిచేయడానికి వెళుతున్నానని తల్లికి చెప్పి, శనివారం వరకు రాకపోవడంతో చుట్టుపక్క, బంధువుల ఇండ్లలో వెతికిన దొరకకపోవడంతో తల్లి భూక్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.