రాష్ట్రంలోని తాటి, ఈత చెట్లు ఎక్కి కళ్ళు గీసే గీత కార్మికుల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయడం హర్షణీయమని గౌడ జర్నలిస్ట్ సంఘం నాయకుడు దొమ్మటి భానుచందర్ గౌడ్ అన్నారు. కళ్ళు గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం అందించే కిట్లలో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటి పరికరాలను అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంఎల్ఏ నాగరాజుకు గీత కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలుపారు.