వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా సివిల్ సప్లై అధికారి

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లో నూతన గోదాము దగ్గర ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రమును జిల్లా సివిల్ సప్లై అధికారి నాగర్ కర్నూల్ జిల్లా అధికారి స్వామి కుమార్ తనికి చేశారు. జిల్లా అధికారి వెంబడి ఉప్పునుంతల తహసిల్దార్ శ్రీకాంత్, పి ఎస్ సి ఎస్ సంఘ సీఈఓ రవీందర్ రావు, సెంటర్ కొనుగోలు ఇంచార్జ్ శోభ, సంఘ సిబ్బంది శంకర్, రాములు, కాశన్న, రైతులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా సివిల్ సప్లై అధికారి  రైతులకు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కు తీసుకొని వచ్చే ముందు వరి ధాన్యం ఆరపెట్టుకొని సరైన తేమ శాతం, నాణ్యత గల వరి ధాన్యమును కొనుగోలు సెంటర్ కు తీసుకొని వచ్చిన వెంటనే రైతల యొక్క పట్టా పాస్ బుక్,బ్యాంకు అకౌంట్ ఆదార్, వరి కొనుగోలు టోకెన్ ను  సెంటర్ ఇంచార్జ్ కి ఇచ్చి సహకరించగలరు అని రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది.