ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న కౌన్సిలింగ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే హాజరై, పరిశీలించారు. రెవెన్యూ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ శాఖలకు సంబంధించి 187 మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్షాలోమ్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జయపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు.