బాన్సువాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడైన పిచ్చుకనుమడ్లు వన ప్రేమికుడిగా గుర్తించి ఆయనను అభినందిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో ఆయనను సన్మానించారు. పిచ్చుక హనుమండ్లు (విశ్రాంత ఉపాధ్యాయులు) భాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న అతను తన స్వంత ఇంటి ఆవరణలో ప్రస్తుతం 300 మొక్కలు పెంచి వాటిని సంరక్షణ చేసినందుకుగాను మరియు గత 50 సంవత్సరాలుగా తాను బోధించిన ప్రతి పాఠశాలలో విద్యార్థులతో మొక్కలు నాటించి సంరక్షించేలా చేసినందుకుగాను తాను చేసిన కృషిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పిచ్చుక హనుమాన్లు ను సత్కరించరు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎం. సురేంధర్ పాల్గొన్నారు.