డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నవతెలంగాణ – హలియా

నల్గొండ నాగార్జునసాగర్ హైవేపై పులిమామిడి స్టేజి వద్ద ఎస్ ఎస్ టి, పోలీస్ చెక్ పోస్ట్ పరిశీలన… అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ లోని ఐటిఐ కళాశాలలో డిఆర్సి డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ సెంటర్ ను సందర్శించారు. డిఆర్సి సెంటర్లో మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరాలు పనితీరు, ఎలక్ట్రిసిటీ, స్ట్రాంగ్ రూముల భద్రత ను పరిశీలించారు.నాగార్జునసాగర్ నియోజవర్గానికి చెందిన డీఆర్సీ సెంటర్లో మాలిక సదుపాయాలు ఎలా ఉన్నాయనేది పరిశీలన చేశాం అని ప్రతి ఒక్కరు ఓటర్ లిస్టులో పేరు ఎక్కడుందో పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో  ముందే చూసుకోవాలి అన్నారు.18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు కోసం ఎన్రోల్ చేసుకోవాలి అన్నారు. ఆమె వెంట రెవెన్యూ  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.