ఈవీఎం గోడౌన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

నవతెలంగాణ- తాడ్వాయి 
ఎస్పీ ఆఫీసు  సమీపంలో గల  ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను  పరిశీలించారు. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును , పోలీసు భద్రత ను , పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో  అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అనిల్ కుమార్,ఇందిర  సంబంధిత  ఉన్నారు.