మండలంలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్

నవతెలంగాణ గాంధారి
గాంధారి మండలంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించడం జరిగింది. గాంధారి గ్రామ పంచాయతీ ఐకేపీ భవనంలో స్కూల్ యూనిపాం లను స్టిచింగ్ పరిశీలించడం జరిగింది. గాంధారి లోని బస్టాండ్ కి దగ్గరలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసే క్యాంటింగ్ ను పరిశీలించడం జరిగింది. బస్ స్టాండ్ ఆవరణ లో శానిటేషన్ ను పరిశీలించడం జరిగింది బస్టాండ్ యొక్క శానిటేషన్ పనులు ఎప్పటి కప్పుడు చేయించాలని కామారెడ్డి డిఏం కు మరియు పంచాయతీ కార్యదర్శి సూచించారుగాంధారి రోడ్డు కు మధ్యలో మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శి సూచించారు  PHC ని సందర్శించి హాస్పిటల్ లో అన్ని రికార్డులు చూసి అందరూ స్టాఫ్ తో మాట్లాడటం జరిగింది. తదనంతరం హాస్పిటల్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని వన్మహోత్సవంలో భాగంగా మండలం లోని మార్కండేయ టెంపుల్ దగ్గర మొక్కలు నాటారు  లొంక తండ  వాగు బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. దానికి పూడిక తీత, మరమత్తులు చెప్పంచాలని దానికి  రూ.50,000/- ఖర్చులకు ఇస్తామని, దానికి సంబంధించిన పనులు చెప్పించాలని ఎంపిడివోకు సూచించారు. తరువాత గాంధారి లోని మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను  సందర్శించడం జరిగింది.
   మధ్యహ్న భోజనం పరిశీలించడం జరిగింది. వంటశాల గది శుభ్రంగా లేనందున మధ్యన భోజనం వండే వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలం లోని KGBV స్కూల్ లోని మధ్యాహ్న భోజనం పరిశీలించి స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సుడిగాలి పర్యటన చేపట్టారు. మండల కేంద్రంలోని మండల సమైక్య ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. పారిశుద్ధ పనులను చూశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ చందర్ డాక్టర్ విజయలక్ష్మి, పర్యవేక్షకుడు సంగీత్ కుమార్ డిపిఎం రమేష్ , ఎల్లారెడ్డి  ఆర్ డి వో శ్రీ ప్రభాకర్, బాన్స్ వాడ ఆఫ్ డి వో  పి. సాగర్ , గాంధారి తహశీల్దార్  సతీష్,ఎంపిడివో  రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.