నవతెలంగాణ- బొమ్మలరామారం
కలెక్టరే కాకుండా విద్యార్థులకు పాఠాలు బోధించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు.బొమ్మలరామారం మండల జిల్లా పరిషత్ హై స్కూల్ ని సోమవారం తనిఖీ చేశారు.తరగతి గదిని సందర్శించారు. స్వయంగా విద్యార్థులకు గణిత, ఇంగ్లీష్ పాఠాలు బోధించి విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. తరగతుల వారీగా హాజరు శాతం ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టుల వారీగా మెరుగైన విద్యా బోధన అందజేయాలన్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని అన్నారు.