ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి

నవతెలంగాణ మద్నూర్: రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లల్లో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్, జుక్కల్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ మను చౌదరి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర బోర్డర్ ను సందర్శించారు. అనంతరం మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమును వారు పరిశీలించారు. రాష్ట్ర సరిహద్దులో కొనసాగుతున్న చెకింగ్ చెక్ పోస్ట్ అధికారులకు అసెంబ్లీ ఎన్నికల పట్ల నిఘా కట్టుదిట్టంగా కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ పట్ల అధికారులకు పకడ్బందీ ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తాహాశిల్దార్ ముజీబ్, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బంది బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.