జిల్లాలో ఎరువులు సరిపోయేంత నిల్వలు ఉన్నాయి

– ఎరువుల కొరత రాకుండా చూడాలని అధికారులకు సుదర్శన్ రెడ్డి సూచన
– బోధన్ ఎమ్మెల్యే, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ- కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో ఎరువుల కొరత రాకుండా సహకార సంఘాల వద్ద రైతులకు కావలిసినంత ఎరువులు నిల్వలు వుండే విధంగా సొసైటీ కార్యదర్శులకు కఠినమైన సూచనలు ఇవ్వాలని,ఎరువుల నిల్వల విషయంలో గాని,రైతులకు ఎరువులను అందించే విషయంలో గాని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత ఏర్పడ్డ దానికి సహకార సంఘాల కార్యదర్శులు,జిల్లా అధికారులు బాధ్యత వచించల్సి వుంటుందని, కావున అధికారులు ఎరువుల కొరత రాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా రైతులు తమకు అవసరం వున్నంత ఎరువులను తమవద్ద నిల్వ చేసుకోవాలని రైతులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లా అధికారులు,సహకార సంఘాల కార్యదర్శులు ఎరువుల కొరత రాకుండా, రాబోయే 15 రోజులు రైతులకు కావలిసినంత ఎరువులు నిల్వలు వుండే విధంగా అధికారులు చూసుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు.