
నవతెలంగాణ- కంటేశ్వర్
మత్స్యశాఖ జిల్లా అధికారి రాజనర్సయ్య పై వెంటనే చర్యలు తీసుకోవాలని గంగపుత్ర సంఘం ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మాడవేటి వినోద్ కుమార్ నగర అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు మాట్లాడుతూ..మొన్న కోటగిరి మండలం రాంపూర్ గ్రామంలో చేపల చెరువుల సొసైటీ లో మన గంగపుత్రులు ఉన్న దగ్గర, గంగపుత్రులను కాదని ముదిరాజ్ లకు సొసైటీ లో సభ్యత్వం ఇవ్వడానికి ముదిరాజ్ లకు వృత్తి నైపుణ్య పరీక్షలను నిర్వహించిన మత్స్య శాఖ జిల్లా అధికారి రాజనర్సయ్య పై వెంటనే చర్యలు తీసుకోవాలని మన గంగపుత్ర నాయకులు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ దీటి మల్లయ్య ద్వారా మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అని, మంత్రి స్పందిస్తూ గంగపుత్రులు ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర కులాలకు సొసైటీలలో సభ్యత్వం ఇవ్వమని చెప్పారు అని గంగపుత్ర సంఘం ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మాడవేటి వినోద్ కుమార్,నగర గంగపుత్ర సంఘము అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య లు తెలిపారు. అందుకు అనుగుణంగా సమన్వయ కమిటీ తీర్మానం ప్రకారం నడుచుకుంటామన్నారు. హైదరాబాద్ లోనే ఆదివారం జరిగిన దళిత బంధు కార్యక్రమం లో కూడా పాల్గొనడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, నగర గంగపుత్ర సంఘము అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య, గంగపుత్ర సంఘం న్యాయ సలహా దారులు దుబ్బాక రవి, డిసిసిబి డైరెక్టర్ కె. ఆనంద్, మిట్టపల్లి ఎంపిటిసి బాలగంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.