నిర్దేశించిన సమయంలోగా మిషన్ భగీరథ త్రాగునీటి సర్వేను పూర్తి చేయాలని ఆర్మూర్ డి ఎల్ పి ఓ శివరామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని చౌట్ పల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ త్రాగునీటి సర్వేను ఆయన పరిశీలించారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన మిషన్ భగీరథ నీరు వస్తుందా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇండ్ల సంఖ్య ఎంత అని పంచాయతీ కార్యదర్శి గంగా జమునను అడిగి తెలుసుకున్నారు.వర్షాకాలం సీజన్ ఆరంభమైందున ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ మంచిగా చేయించాలన్నారు. గ్రామంలో ఇంటి పన్నుల డిమాండ్ ఎంత అని కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పన్నుల వసూళ్లను పెంచాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదానంద్, పంచాయతీ కార్యదర్శి గంగా జమున, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.