పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

The DMHO conducted a surprise inspection of the PHCనవతెలంగాణ – లోకేశ్వరం 
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎమ్ హెచ్ ఓ రాజేందర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యురాలు తేజస్వినికి సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి శ్రమదానం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కేంద్రం చుట్టూ పక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సోలమన్ రాజ్, సూపర్డెంట్ వెంకట రమేష్ ,పంచాయతీ కార్యదర్శి గంధం వినయ్ సాయి పంచాయతీ కార్మిక సిబ్బంది కూడా పాల్గొన్నారు.