రేవు రిలీజ్‌కి రెడీ

The port is ready for releaseవంశీ రామ్‌ పెండ్యాల, అజరు, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌, పారుపల్లి ప్రొడక్షన్‌ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్‌ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్‌ విజన్‌గా జర్నలిస్ట్‌ ప్రభు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్‌ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఈనెల 23న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మురళి గింజుపల్లి మాట్లాడుతూ, ఇప్పటికే ట్రైలర్‌, మూడు అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇంకో పాట కూడా ఉంది. అది త్వరలోనే వస్తుంది. సినిమా రిలీజయ్యాక ఆ పాట చూసి మరింత ఎగ్జైట్‌ ఫీల్‌ అవుతారు అని అన్నారు. ‘ఎప్పుడో సంవత్సరం క్రితం నేను ఒక అయిదు నిమిషాల ట్రైలర్‌ చూసాక ప్రేక్షకులకు నచ్చుతుంది ఈ సినిమా అనే కాన్ఫిడెన్స్‌ ఏర్పడింది. ఆ నమ్మకమే ఈనెల 23 సినిమా రిలీజ్‌ వరకు తీసుకొచ్చింది’ అని ప్రభు చెప్పారు. పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ,’హరినాథ్‌ పులి చేసిన ఈ సినిమా, అతని టేకింగ్‌ చూసాక ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో మా ఫ్రెండ్స్‌ మురళి గింజుపల్లి, నవీన్‌ పారుపల్లిలకు చెప్పి ఈ సినిమాను ఈ స్టేజీవరకు తీసుకొచ్చాం. ఓ మంచి సినిమాని చూడబోతున్నారని చెప్పగలను’ అని తెలిపారు.