మహిళ ప్రాణాలు తీసిన కుక్క..

నవతెలంగాణ-డిచ్ పల్లి : ఒక పని నిమిత్తం భార్య భర్త కలిసి ద్విచక్ర వాహనంపై వేస్తుండగా మార్గమధ్యంలో ఒక కుక్క అడ్డువచ్చి ప్రాణాన్ని బలి తిసుకుంది.డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని రాంపూర్ డి  గ్రామానికి చెందిన నడిపోల్లా సుబ్బయ్య  భార్య నడిపోల్లా లత 34 ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనం పై నిజామాబాద్ కు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వేళుతుండగా మార్గ మధ్య లోని ధర్మారం -బి గ్రామం లోని బ్యాంకు అఫ్ భరోడ వద్ద ద్విచక్ర వాహనంపై వేళ్తుండగా కుక్క అడ్డు రావడంతో  ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడటం వాళ్ళలత  తలకు బలమైన గాయమైంది. వేంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరిఫ్ తెలిపారు.  మృతురాలి అన్న పెట్ల నవీన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ వివరించారు. ఒక పని నిమిత్తం అని ఇంటి నుండి వేళ్ళని మృతి చెందాడంతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.