– రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్
– గంట వ్యవధిలో చైన్ స్నాచింగ్
– కేసు ఛేదించిన యాచారం పోలీసులు
– సీఐ, సిబ్బందిని అభినందించిన సీపీ సిబ్బందికి రివార్డు అందజేత
నవతెలంగాణ-యాచారం
విధి నిర్వహణలో పోలీసుల కర్తవ్యం ఎంతో గొప్పదని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ అన్నారు. 24వ తేదీన యాచారం గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ దొంగలను సీఐ లింగయ్య ఇచ్చిన గైడ్లైన్స్‌తో గంట వ్యవధి లోనే పోలీసులు పట్టుకున్నారు. దాంతో గొలుసు దొంగను పట్టుకున్న కానిస్టేబుల్ పి.కృష్ణ, హౌంగార్డు బి.సంతోష్‌ల ను రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సీపీ డీఎస్ చౌ హాన్ అభినందించారు. అలాగే సిబ్బందికి రివార్డు అందుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ యాచారం పోలీసుల పనితీరు బాగా ఉందని కితాబు ఇచ్చారు. ఘటన జరిగిన గంట వ్యవధిలోనే గొలుసు దొంగలను పట్టుకో వడం గొప్ప విషయం అన్నారు. సమాజ రక్షణలో పోలీసు లు కవచం లాగా రాత్రింబవళ్లు ప్రాణాలను లెక్కచేయకుం డా నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజలకు హాని కలిగించే చీడపురుగులను ఎప్పటికప్పుడు పసిగట్టి ఏరివేయాలని సూచించారు. ప్రజల భద్రతకు పోలీసులు నిరంతరం పని చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్య క్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.