రవితేజ నటిస్తున్న ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. లేటెస్ట్‌గా టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ‘కొండలో లావాని కిందకి పిలవకు… ఊరు ఉండదు…నీ ఉనికి ఉండదు’ అంటూ రవితేజ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో, స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ టీజర్ ఓపెన్ అయ్యింది. ప్రజలకు అపోహగా, ప్రభుత్వాలు దాచిపెట్టిన కథగా హీరో చేసే విధ్వంసాన్ని విజువల్స్ అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. చివరిగా రవితేజ పవర్ ఫుల్‌గా పరిచయమౌతూ డిఫరెంట్ అవతార్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల మధ్య సంభాషణ, నవదీప్ మాటలు రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చాయి. వినరు రారు డెడ్లీ విలన్‌గా కనిపించారు. కావ్యా థాపర్ మరో కథానాయిక కాగా, మధుబాల కీలక పాత్రలో కనిపించనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.