
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మాంటిస్సోర్రి హైస్కూల్లో అక్రమంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్ ఎస్ యు ఐ నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ మాంటిసోరి హై స్కూల్ నందు తనిఖీ చేయగా పుస్తకాలు అమ్ముచున్న గదిని సందర్శించి కలెక్టర్, డీఈవో గార్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి మండల విద్యాధికారులను స్కూళ్ల వద్దకు పంపించి పుస్తకాలు విక్రయిస్తున్న గదులను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అలాంటి స్కూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎన్ ఎస్ యు ఐ అండగా ఉంటుందని ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సంతోష్,సోషల్ మీడియా ఇంచార్జ్ గద్దల అందీప్, జిల్లా కార్యదర్శి గణేష్ ముదిరాజ్,బోనగిరి యశ్వంత్,మామిడాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.