
డోంగ్లి మండలంలోని మోగా గ్రామ అభివృద్ధికి ఆ గ్రామ సర్పంచ్ సూర్యకాంత్ పటేల్ ఆ గ్రామ ఎంపిటిసి సభ్యులు గంగామణి కృషి అభినందనీయమని ఆ గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు గ్రామ ముదిరాజ్ సంఘం సంఘ భవన నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే 5 లక్షల నిధులు మంజూరు చేయగా ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ సూర్యకాంత్ పటేల్ గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు గంగామణి కుమారుడు గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘానికి సంఘ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సండేకు కృషిచేసిన గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలకు ముదిరాజ్ కులస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పెద్దలు, ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
మొగలో కమ్యూనిటీ హాల్ భూమి పూజ…
డోంగ్లి మండలం మొఘ గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కు ఎస్.డి.ఎఫ్ ఫండ్ ద్వారా ఐదు లక్షలు ఎమ్మెల్యే గారు మంజూరు చేయడంతో ఈరోజు సర్పంచ్ సూర్యకాంతరావు పటేల్ మరియు ఎంపిటిసి నారాయణ మరియు తదితరులు పాల్గొని భూమి పూజ చేసినారు. సర్పంచ్ సూర్యకాంతరావు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.